ఘనంగా సామల సదాశివ జయంతి | - | Sakshi
Sakshi News home page

ఘనంగా సామల సదాశివ జయంతి

May 12 2026 5:36 AM | Updated on May 12 2026 5:36 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: పట్టణంలో సోమవారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, బహుభాషా కోవిదుడు డాక్టర్‌ సామల సదాశివ జయంతిని తెలుగు సాహితీ సదస్సు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్‌ సమీపంలోని సామల సదాశివ విగ్రహానికి పూలమల వేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ సదాశివ మాస్టారు బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌లో కనిపించే సాహిత్య కళా వైవిధ్యం సామల సదాశివ కవితల్లో కనిపిస్తుందన్నారు. ఉర్దూ, పార్శీ, తెలుగు, మరాఠీ భాషల్లో ఆయన విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. సాహిత్య, చిత్రలేఖన రంగాల్లో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలుగు సాహితీ సదస్సు అధ్యక్షుడు పెండ్యాల కిషన్‌శర్మ, క్రియాశీలక అధ్యక్షుడు కటుకం మధుకర్‌, ఎంఈవో ప్రభాకర్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్‌ అధికారి జాడి దేవాజీ, ఉపాధ్యాయ సంఘం నాయకులు శాంతికుమారి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement