చెక్‌పోస్టుల వద్ద అప్రమత్తత అవసరం | - | Sakshi
Sakshi News home page

చెక్‌పోస్టుల వద్ద అప్రమత్తత అవసరం

May 7 2026 8:14 AM | Updated on May 7 2026 8:14 AM

● కలెక్టర్‌ కె.హరిత

సిర్‌పూర్‌(టి): చెక్‌పోస్టు వద్ద విధుల్లో ఉన్న సిబ్బందికి నిత్యం అప్రమత్తత అవసరమని, ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. మండలంలోని పెద్దబండ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును తనిఖీ చేసి రిజిస్టర్‌ పరిశీలించా రు. జిల్లాలో యాసంగి వరిధాన్యం కొనుగోళ్లు ప్రా రంభమైన నేపథ్యంలో పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా జిల్లాకు రవాణా అయ్యే అవకాశం ఉందనన్నారు. నిషేధిత పత్తి విత్తనాలు, గడ్డిమందు, మత్తు పదార్థాల రవాణాను అడ్డుకోవాలని ఆదేశించారు.

మెరుగైన వైద్యసేవలందించాలి

చింతలమానెపల్లి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. మండలంలోని బాబాపూర్‌– రవీంద్రనగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బుధవారం ఉదయమే చేరుకుని సిబ్బంది హాజరు తీరును పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. వేసవి నేపథ్యంలో ఓఆర్‌ఎస్‌ అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం దిందా గ్రామానికి వెళ్లే మార్గంలో చేపట్టిన వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను నాణ్యతతో పూర్తిచేయాలని ఇంజినీరింగ్‌ అధికారులు ఆదేశించారు. సమీపంలోని ప్రాణహిత నదిని సందర్శించారు. నీటి ప్రవాహం వివరాలను స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement