కౌటాల: మా నాన్న సంఘ కిరణ్‌కుమార్ ప్రైవేట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తారు. నాన్న ఎప్పుడు పనిలో బిజీబిజీగా ఉంటారు. అన్ని పనులు అమ్మే చేస్తూ ఉంటుంది. నాకు మా చెల్లికి హోమ్ వర్క్‌లో అమ్మ సాయం చేస్తుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియజేస్తుంది. పదో తరగతి పరీక్షల్లో నాకు మంచి మార్కులు రావడానికి అమ్మే కారణం. నేను వార్షిక పరీక్షలకు ప్రిపేర్ కావడానికి అన్నీ సిద్ధం చేసింది. నేను భయం లేకుండా పరీక్షలు ఎలా రాయాలో అమ్మే నేర్పింది.
– తల్లి గౌతమి, చెల్లి రిత్వికవర్మతో నిఖిత వర్మ, కౌటాల


