బడుల్లో సందడి..! | - | Sakshi
Sakshi News home page

బడుల్లో సందడి..!

May 11 2026 7:32 AM | Updated on May 11 2026 7:32 AM

● నేటి నుంచి విద్యాశాఖ వారోత్సవాలు ● ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచడమే లక్ష్యం ● జిల్లావ్యాప్తంగా 729 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. సోమవారం ప్రారంభోత్సవాల సందడి ఉండనుంది. కొత్త పాఠశాల భవనాలు, అదనపు తరగతి గదులు, సైన్స్‌ ల్యాబ్‌లు, డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు, ఆధునిక టాయిలెట్లను ప్రారంభిస్తారు. పీఎంశ్రీ పాఠశాలలు, కేజీబీవీల్లో 15 రోజులపాటు ప్రత్యేక శిబిరాలు, కోడింగ్‌, రోబోటిక్స్‌, యోగా, కరాటే, క్రీడలు, నాటకం, సంగీతంతో పాటు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తారు. జిల్లాలోని రెబ్బెన, ఆసిఫాబాద్‌, బెజ్జూర్‌, కౌటాలలోని కేజీబీవీ అదనపు గదులను ప్రారంభిస్తారు. కేజీబీవీ రెబ్బెన, టీజీఎంఎస్‌ ఆసిఫాబాద్‌, జీహెచ్‌ఎస్‌ ఓల్డ్‌ కాగజ్‌నగర్‌లలో సమ్మర్‌ క్యాంప్‌లు ప్రారంభించనున్నారు. ● 12న పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, ఫెయిలైన సబ్జెక్టుల్లో నిపుణులతో ఉచిత కోచింగ్‌. జీహెచ్‌ఎస్‌ ఓల్డ్‌ కాగజ్‌నగర్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ పెంచికల్‌పేట్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ బాలికల ఆసిఫాబాద్‌, టీజీఎంఎస్‌ సిర్పూర్‌(యు)లోని పాఠశాలలో ప్రత్యేక శిక్షణను ప్రారంభించనున్నారు. ● 13న సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులతో విద్యాభివృద్ధిపై వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. బడి బాగు కోసం వారి సలహాలు, సూచనలు తీసుకుంటారు. ఐడీవోసీ ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌లో సమావేశం ఏర్పాటు చేస్తారు. ● 14న ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ బడీడు పిల్లలను గుర్తించి నమోదు చేస్తారు. అదేరోజు పేరెంట్‌, టీచర్‌ మీటింగ్‌లు, పూర్వ విద్యార్థుల సమ్మేళనం, మధ్యాహ్న భోజనం వంటల పోటీలు నిర్వహిస్తారు. బడిబాట కార్యక్రమాన్ని జెడ్పీహెచ్‌ఎస్‌ బాలికల ఆసిఫాబాద్‌, ఎంపీపీఎస్‌ భట్టుపల్లిలో చేపడతారు. ● 15న లైబ్రరీ ది హార్ట్‌ ఆఫ్‌ నాలెడ్జ్‌ పేరుతో పుస్త క ప్రదర్శనలు, విద్యార్థులతో బుక్‌ టాక్‌ కార్యక్రమాలు ఉంటాయి. అన్ని లైబ్రరీలను డిజిట లైజ్‌ చేసి ఆన్‌లైన్‌ క్యాటలాగ్‌ ప్రారంభిస్తారు. ● 16న తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కోలాటం, ఒగ్గుకథ, లంబాడీ నృత్యం, పేరిణి శివతాండవం వంటి కళారూపాలను ప్రదర్శిస్తారు. విద్యార్థులతో ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ ఎగ్జిబిషన్‌ చేపడతారు. ● 17న ముగింపు రోజు పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల్లో రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి టాపర్లను సన్మానిస్తారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేస్తారు.

కాగజ్‌నగర్‌టౌన్‌: విద్యా ప్రమాణాలు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం నుంచి 17 వరకు ఏడు రోజుల పాటు విద్యాశాఖ వారోత్సవాలు నిర్వహించనుంది. రోజుకో కార్యక్రమం చొప్పున అధికారులు ఏడు రకాల కార్యక్రమాలు చేపట్టనున్నారు. సర్కారు బడులపై విశ్వా సం పెంచడం, విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీయడం, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులను భాగసామ్యం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఏడు రోజులు..

ఘనంగా నిర్వహించాలి

ఆసిఫాబాద్‌రూరల్‌: తెలంగాణ విద్యాశాఖ వారోత్సవాలను 11 నుంచి 17 వరకు ఘనంగా నిర్వహించాలని డీఈవో లలిత ఆదేశించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు.

ప్రారంభానికి సిద్ధమైన రెబ్బెన కేజీబీవీ భవనం

Advertisement
 
Advertisement
Advertisement