కాగజ్‌నగర్‌టౌన్: ‘తుక్కు.. ప్ర మాదాల ముప్పు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. గురువారం పట్టణంలోని స్క్రాప్ దుకాణాలను తనిఖీ చేశారు. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా నడుస్తున్న దుకాణాలకు జరిమానా విధించారు. మున్సిపల్ కమిషనర్ తిరుపతి ఆదేశాల మేరకు శానిటరీ ఇన్‌స్పెక్టర్ శంకర్, ఈఈ ప్రణీల్ సిబ్బందితో కలిసి తనిఖీ చేయగా.. ట్రేడ్ లైసెన్స్, ఫైర్ ఎన్‌ఓసీ, పొల్యూషన్ అనుమతి, కొనుగోలు, అమ్మకాల రిజిస్టర్ నిర్వహించడం లేదని గుర్తించారు. నిబంధనలు పాటించని వారిపై మున్సిపల్ యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనిఖీల్లో సిబ్బంది దేవా, ఫారుక్, రమేశ్ పాల్గొన్నారు.
ఎఫెక్ట్


