తీసుకోవాల్సిన జాగ్రత్తలు | - | Sakshi
Sakshi News home page

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

May 17 2026 7:02 AM | Updated on May 17 2026 7:02 AM

వేసవిలో గర్భిణులు, బాలింతలు తగిన జాగత్రలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంతవరకు ప్రయాణాలు తగ్గించాలి. రోజుకు 4–5లీటర్ల నీరు తాగాలి. మధ్యాహ్నం బయటికి వెళ్లాల్సి వస్తే గొడుగు తీసుకెళ్లడం మంచిది. వేసవికాలంలో గర్భిణుల్లో ఉమ్మ నీరు తగ్గే అవకాశముంది. అందుకే డీహైడ్రేషన్‌కు గురవకుండా చూడాలి. 100 కంటే శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైతే వడదెబ్బ తాకినట్లు భావించాలి. కొ బ్బరి బోండాలు, మజ్జిగ, విటమిన్‌ సీ, పండ్ల ర సాలు ఎక్కువగా తీసుకోవాలి. స్నానం చేశాక శ రీరానికి కొబ్బరి నూనె రాసుకోవాలి. తేలికగా జీ ర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. వేపుళ్లకు దూ రంగా ఉండాలి. రక్త హీనతతో బాధపడే మహిళలు పోషకాహారం తీసుకోవాలి. ఐరన్‌ అధికంగా ఉండే తోటకూర, పాలకూర, ఇతర ఆకుకూరలతో పాటు బెల్లం, వేరుశెనగలు, నువ్వులు, ఖర్జూ రం, ఎండు ద్రాక్ష తినాలి. చికెన్‌, లివర్‌, గుడ్లు తీసుకోవడం ద్వారా రక్తం త్వరగా పెరుగుతుంది. విటమిన్‌ ‘సీ’ కోసం నిమ్మరసం, ఉసిరి వంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఐరన్‌ పోలిక్‌ యాసిడ్‌ మాత్రలను క్రమం తప్పకుండా వేసుకోవాలి. టీ, కాఫీకి దూరంగా ఉండాలి.

Advertisement
 
Advertisement
Advertisement