పోటీతత్వంతో విజయం | - | Sakshi
Sakshi News home page

పోటీతత్వంతో విజయం

May 12 2026 5:36 AM | Updated on May 12 2026 5:36 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకుంటే విజయం సాధించవచ్చని సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా అన్నారు. పట్టణంలోని డివిజన్‌ రిసోర్స్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న ఉచిత పాలిటెక్నిక్‌, ఇతర ఎంట్రెన్స్‌ కోచింగ్‌ సోమవారం ముగిసింది. నాలుగేళ్లు ఉచిత శిక్షణ శిబిరం నిర్వహించడంపై కోఆర్డి నేటర్‌ కటుకం మధుకర్‌, ఉపాధ్యాయులను అభినందించారు. అంతకుముందు సామల సదాశివ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు దేవాజీ, సాబీర్‌, మోహన్‌, రవి, శ్యాంసుందర్‌, త్రివేణి, శాంతికుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement