కార్మికుల ఐక్యతకు ప్రతీక ‘మేడే’ | - | Sakshi
Sakshi News home page

కార్మికుల ఐక్యతకు ప్రతీక ‘మేడే’

May 2 2026 8:08 AM | Updated on May 2 2026 8:08 AM

ఆసిఫాబాద్‌: కార్మికుల ఐక్యతకు ప్రతీక మేడే అని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్‌ అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ వద్ద జెండా అవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మేడేను పండగలా కాకుండా పోరాట దినంగా జరుపుకోవాలన్నారు. కార్మిక ఐక్యతను బలోపేతం చేస్తూ దోపిడీ, అణచివేత, వివక్షలకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ కమిటీ గోదాము వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సివిల్‌ సప్లై కార్మికులు మేడే ఉత్సవాలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌ నాయకులు దిన్‌కర్‌, రైతు సంఘం నాయకులు తిరుపతి, శ్రీకాంత్‌, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్‌కిషన్‌, మండల అధ్యక్షుడు కమలాకర్‌, సివిల్‌ సప్లై హమాలీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్టుపెల్లి సుధాకర్‌, నాయకులు, కార్మికులు మాట్ల రాజయ్య, సమ్మయ్య, నంది పద్మ, శ్రీలక్ష్మి, రమ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement