పెన్షనర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

పెన్షనర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలి

May 14 2026 6:45 AM | Updated on May 14 2026 6:45 AM

● సీఎంపీఎఫ్‌ రీజినల్‌ కమిషనర్‌ భరత్‌కుమార్‌

నస్పూర్‌: ఉద్యోగులు, పెన్షనర్లకు పీఎఫ్‌, పెన్షన్‌ సెటిల్మెంట్‌లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎంపీఎఫ్‌ రీజినల్‌ కమిషనర్‌ భరత్‌కుమార్‌ అన్నారు. బుధవారం శ్రీరాంపూర్‌ జీఎం కార్యాలయంలో సింగరేణి, సీఎంపీఎఫ్‌ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ప్రయాస్‌ కో ఆర్డినేషన్‌ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఉద్యోగి పీఎఫ్‌, పెన్షన్‌ సెటిల్మెంట్‌ల కోసం అందుబాటులోకి తెచ్చిన సీ–కేర్స్‌లో పెండింగ్స్‌ను జీరో పెండింగ్‌లోకి తేవడమే లక్ష్యంగా సీఎంపీఎఫ్‌ కార్యాలయం వారు తలపెట్టిన కార్యక్రమమే ప్రయాస్‌ అన్నారు. ఉద్యోగులు చిన్న చిన్న కారణాలకు పీఎఫ్‌ డబ్బులను విత్‌డ్రా చేసి వాటిని దుర్వినియోగం చేసుకోవద్దని సూచించారు. తాను గతంలో అండర్‌ గ్రౌండ్‌ మైన్‌లలో ఇంజినీర్‌గా విధులు నిర్వహించానని, క్షేత్ర స్థాయిలో ఉద్యోగుల సాధక బాధలు తెలుసన్నారు. జీఎం శ్రీనివాస్‌ మాట్లాడుతూ గతంలో సీఎంపీఎఫ్‌ సమస్యల పరిష్కారం ఎంతో కష్టంగా ఉండేదన్నారు. ప్రస్తుతం సీఎంపీఎఫ్‌ అధికారులే ఉద్యోగుల వద్దకు రావడం శుభపరిణామం అన్నారు. సమావేశంలో సీఎంపీఎఫ్‌ రీజినల్‌ కమిషనర్‌–2 గోవర్ధన్‌, గుర్తింపు కార్మిక సంఘం బ్రాంచి కార్యదర్శి బాజీసైదా, డీజీఎం (పర్సనల్‌) అనిల్‌కుమార్‌, సీనియర్‌ పీవో సురేందర్‌, జీఎం చర్చల ప్రతినిధి బద్రి బుచ్చయ్య, పిట్‌ కార్యదర్శి సందీప్‌, శ్రీరాంపూర్‌ ఏరియాలోని అన్ని గనుల సంక్షేమాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement