రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు

May 15 2026 10:32 AM | Updated on May 15 2026 10:32 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. కాగజ్‌నగర్‌ పట్టణంలోని పీఏసీఎస్‌లో మక్క, వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం సబ్‌కలెక్టర్‌ శ్రద్ధా శుక్లాతో కలిసి పరిశీలించారు. అనంతరం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని నిల్వ చేసే గోదాంలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆర్‌ఆర్‌వో కాలనీలోని ఎఫ్‌ఏసీ గోదాంను పరిశీలించారు. కార్యక్రమంలో డీసీఓ మోహన్‌, తహసీల్దార్‌ మధుకర్‌, మార్కెటింగ్‌ ఎస్‌డబ్ల్యూసీ అశ్వక్‌, పీఏసీఎస్‌ మేనేజర్‌ సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement