ఆసిఫాబాద్‌రూరల్: గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తామని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. మండలంలోని రౌట సంకెపల్లి గ్రామంలో రాష్ట్ర గవర్నర్ మార్గదర్శకత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కుమురంభీం, ఎడ్ల కొండు జన్మించిన గ్రామంలో సౌకర్యాలను మెరుగుపర్చేందుకు అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. అటవీ భూములు కలిగి ఉండి చనిపోయిన రైతుల వారసులకు హక్కులు కల్పించాలని గ్రామస్తులు కోరారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులు పీవోను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొండు, గ్రామస్తులు కిష్టయ్య, రాము తదితరులు పాల్గొన్నారు.


