జైపూర్: జైపూర్ ఎస్టీపీపీని శనివారం సింగరేణి బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ నల్ల పూరి రమేశ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పేరం రమేశ్ సందర్శించారు. ఇటీవల ఎస్టీపీపీ బ్రాంచ్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన లైజన్ ఆఫీసర్‌గా ఎన్నికై న వీరబ్రహ్మం (డీజీఎం)ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్టీపీపీ జీఎం నర్సింహారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్టీపీపీలో బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి ఆఫీస్ గది ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఎస్వోటూ జీఎం శంకర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఠాకుర్‌మోహన్‌సింగ్, బీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయ్, జాయింట్ సెక్రటరీ రాకేశ్, ట్రెజరర్ అరుణ, సభ్యులు రవిచంద్ర, శ్యామల, నిసరొద్దీన్, రాజు, రాజేశ్, నరేశ్ తదితరులున్నారు.


