ఆసిఫాబాద్‌రూరల్: వేసవి సెలవుల్లో విద్యార్థులు వివిధ అంశాల్లో నైపుణ్యం పెంచుకునేందుకు వీలు గా జిల్లాలోని పీఎంశ్రీ ప్రభుత్వ పాఠశాలల్లో 15 రో జులపాటు సమ్మర్ క్యాంపులు నిర్వహించనున్నా రు. ఈ నెల 11 నుంచి 25 వరకు 6 నుంచి 9వ తరగతి వివిధ ఆటలు, నృత్యాలు, సృజనాత్మకత, కళలు, జీవన నైపుణాలు నేర్పించనున్నారు. ఇందుకోసం జిల్లాలో పది పీఎంశ్రీ పాఠశాలలను ఎంపిక చేయగా, ఒక్కో క్యాంపులో వందమంది చొప్పున అవకాశం కల్పిస్తారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు విభిన్న అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఇతర పాఠశాలల విద్యార్థులు కూడా పాల్గొనే అవకాశం కల్పించారు.
రూ.50వేల చొప్పున నిధులు
పీఎంశ్రీ పాఠశాలల్లో 15 రోజుల పాటు సమ్మర్ క్యాంపులు కొనసాగుతాయి. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు రూ.50 వేల చొప్పున ఖర్చు చేయనున్నారు. ఇందులో విద్యార్థులకు రోజుకు ఒక్కొక్కరికి రూ.15 చొప్పున వెచ్చించి స్నాక్స్ సమకూర్చుతారు. ప్రతీ స్కూల్‌లో నలుగురు వలంటీర్ల(ట్రైనర్లు)ను నియమించారు. వీరికి రూ.3 వేలు చొప్పున మొత్తం రూ.12 వేలు ఖర్చు చేస్తారు. ఇక కలర్లు, స్కెచ్‌లు, ఆట వస్తువులు, ఇతర మెటీరియర్ కోసం రూ.10 వేలు కేటాయించారు. పిల్లలకు ఇష్టమైన డ్యాన్స్, యోగా, కథ చెప్పడం, వ్యక్తిత్వ వికాసం, ఇండోర్ గేమ్స్, సైన్స్ ప్రయోగాలు, క్రీడలు తదితర అంశాలపై తర్ఫీదు ఇవ్వనున్నారు.
జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్
ఎంపికై న స్కూళ్లు ఇవే..
జిల్లాలో మొత్తం 18 పీఎం పాఠశాలలు ఉండగా, ఇందులో ఎంపిక చేసిన పది పాఠశాలల్లోనే సమ్మర్ క్యాంపులు కొనసాగుతాయి. ఆసిఫాబాద్, సిర్పూర్(యు) మోడల్ స్కూ ళ్లు, రెబ్బెన ఉన్నత పాఠశాల, చింతలమానెపల్లి మండలంలో బాబాసాగర్ ఉన్నత పాఠశాల, దహెగాం మండలంలో చిన్న రాస్పెల్లి, కాగజ్‌నగర్ ఓల్డ్ జెడ్పీహెచ్‌ఎస్, కాగజ్‌నగర్ ఉన్నత పాఠశాల, పెంచికల్‌పేట్ ఉన్నత పాఠశాల, సిర్పూర్(టి) ఉన్నత పాఠశాల, వాంకిడి ఉన్నత పాఠశాలల్లో వేసవి శిబిరాలు నిర్వహించనున్నారు. సమీప ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు, ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.


