జై హనుమాన్‌ | - | Sakshi
Sakshi News home page

జై హనుమాన్‌

May 13 2026 2:14 AM | Updated on May 13 2026 2:14 AM

జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్‌ వీరాంజనేయస్వామి

ఆలయంలో మంగళవారం హనుమాన్‌ జయంతి భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఆలయ అర్చకుడు ఒజ్జల శిరీష్‌శర్మ గణపతిపూజ, స్వస్తి పుణ్యహవచనము, నవగ్రహారాధన, రుద్రాభిషేకం, ఫల, పత్ర, పుష్పార్చన, మంగళహారతి, మహామంత్రపుష్పం, మహాదాశీర్వచనము నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. ఏఎంసీ చైర్మన్‌ ఇరుకుల మంగ, ఎమ్మెల్యే కోవ లక్ష్మి తనయుడు సాయినాథ్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు గుండా వెంకన్న, ధర్మపురి వెంకటేశ్వర్లు, పిన్నా వివేక్‌, రూప్‌నార్‌ రమేశ్‌, శ్రీనివాస్‌, బాబుగౌడ్‌, సుధాకర్‌, గణపతి, మురళీగౌడ్‌, లక్ష్మణమూర్తి, నారాయణమూర్తి పాల్గొన్నారు. –ఆసిఫాబాద్‌అర్బన్‌

Advertisement
 
Advertisement
Advertisement