ఘనంగా బుద్ధ పౌర్ణిమ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా బుద్ధ పౌర్ణిమ వేడుకలు

May 2 2026 8:08 AM | Updated on May 2 2026 8:08 AM

వాంకిడి: మండలంలోని వాంకిడి జేత్వాన్‌ బుద్ధ విహార, ఖమాన గ్రామంలోని నాగ్‌సేన్‌ బుద్ధ విహార, ఇందాని, ఖిరిడి, సరాండి, బంబార గ్రామాల్లోని బుద్ధ విహారాల్లో శుక్రవారం భగవాన్‌ బుద్ధుని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుద్ధుడు, అంబేడ్కర్‌ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాంకిడిలో 70 ఫీట్ల పంచశీల్‌ జెండాతో ర్యాలీ చేపట్టారు. బుద్ధుడు చూపిన మార్గంతోనే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్‌ మహోల్కర్‌, ఎస్‌ఎస్‌డీ జిల్లా అధ్యక్షుడు మార్షల్‌ దుర్గం సందీప్‌, నాయకులు జైరాం ఉప్రె, శేఖర్‌ జాడె, కిషన్‌ ఖోబ్రగడె పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement