రెబ్బెన: మండల కేంద్రంలోని ఎల్లమ్మ చెరు వు అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక సర్పంచ్ దుర్గం భరద్వాజ్ కోరారు. శనివారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించడంతో పాటు భూగ ర్భ జలాల పెంపునకు కీలకమైన ఎల్లమ్మ చెరువుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు. పిచ్చిమొక్కలు, పూడిక పేరుకుపోవడంతో ఎగువునున్న ఎన్టీఆర్ కాలనీ ముంపునకు గురవుతోందని తెలిపారు. గతంలో కురి సిన వర్షాలతో కట్ట దెబ్బతిని చెరువు ప్రమాదకర స్థితిలో ఉందని పేర్కొన్నారు. కట్టను బలోపేతం చేయడంతో పాటు పూడికతీత పనులు చేపట్టి చెరువును అభివృద్ధి చేయాల ని కోరారు. చెరువు ఎఫ్‌టీఎల్ సరిహద్దులను గుర్తించి కంచె ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. వెంటనే చెరువు అభివృద్ధి, మరమ్మతు పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.


