కాగజ్‌నగర్‌టౌన్: గౌడ సంఘం అభివృద్ధికి కృషి చే స్తామని ఎమ్మెల్సీ దండె విఠల్ పేర్కొన్నారు. శనివా రం కాగజ్‌నగర్ మండలంలోని ఈజ్‌గాం గ్రామంలో గౌడ సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ చే శారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. గౌ డ కులస్తుల ఐక్యత, సామాజిక అభివృద్ధికి కమ్యూనిటీ హాల్ ఎంతగానో ఉపయోగపడనుందని తెలి పారు. ఎమ్మెల్సీని గౌడ కులస్తులు శాలువాతో సన్మానించారు. సర్పంచ్ సంగీత, సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు కొండ్ర జగ్గాగౌడ్, ఈజ్‌గాం అధ్యక్షుడు తిరుపతి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
క్రీడల్లో గెలుపోటములు సహజం
కౌటాల: క్రీడల్లో గెలుపోటములు సహజమని ఎమ్మెల్సీ దండె విఠల్ పేర్కొన్నారు. మండలంలోని తాటిపల్లి గ్రామంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు శనివా రం ముగిశాయి. ఈ సందర్భంగా గెలుపొందిన తా టిపల్లి జట్టుకు రూ.25వేల నగదు, షీల్డ్, రెండో బ హుమతి వీరవెల్లి జట్టుకు రూ.13 వేల నగదుతో పా టు బహుమతులు అందించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ.. గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఆటల పోటీలు నిర్వహించడానికి సహకరిస్తామని పేర్కొన్నారు. యువ త చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. తాటిపల్లి సర్పంచ్ బడగే సంతోష్, డీసీసీ జి ల్లా ఉపాధ్యక్షుడు దుర్గం జానకీరావు, మండలాధ్యక్షుడు నికాడే గంగారాం తదితరులున్నారు.


