కౌటాల: మా ఊరిలో పనులు లేక మా తల్లి దండ్రులు మహారాష్ట్రకు వెళ్లి 20ఏళ్లు అక్కడే పని చేశా రు. నాన్న శంకర్ తాపీమేసీ్త్ర. నాన్న సంపాదన సరిపోక అమ్మ రోజూ ఐదా రు ఇళ్లలో పని చేసి ఉన్నత చదువులు చదివించింది. ప్రస్తుతం నేను ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్‌గా పని చేస్తున్న. మా పెద్ద తమ్ముడు రైల్వేలో, మా రెండో తమ్ముడు ఫార్మా కంపెనీలో, మా చిన్న తమ్ముడు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. మా అందరికీ వివాహాలు చేసిన మా తల్లిదండ్రులు సంతోషంగా ఉంటున్నారు.
– తల్లి తారాబాయితో జ్యోతి, యాపలగూడ, కౌటాల


