‘ఆలయాన్ని నిర్మించేదాకా ఉద్యమిస్తాం’ | - | Sakshi
Sakshi News home page

‘ఆలయాన్ని నిర్మించేదాకా ఉద్యమిస్తాం’

May 17 2026 7:02 AM | Updated on May 17 2026 7:02 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని పురాతన అంకమరాజు ఆలయాన్ని పునర్నిర్మించేదాకా ఉద్యమిస్తామని అంకమరాజు హక్కుల పోరాట సమితి సభ్యుడు కేశవ్‌రావ్‌, ఆలయ పూజారి ఆత్రం పాండు పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం చేపట్టాలని శనివా రం జిల్లా కేంద్రంలోని అంకమరాజు ఆలయం వద్ద ఆదివాసీలతో కలిసి నిరసన తెలిపారు. మొదట అంకమరాజు ఆలయం నుంచి ర్యాలీగా డోలు వా యిద్యాలతో గాంధీచౌక్‌, వివేకానందచౌక్‌, అంబేడ్కర్‌చౌక్‌, జగ్జీవన్‌రాంచౌక్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వేలాది ఏళ్ల క్రితం పట్టణంలోని ఈ ప్రాంతాన్ని పరిపాలించిన అంకమరాజుకు గోల్కొండ న వాబులను గడగడలాడించిన చరిత్ర ఉందని గుర్తు చేశారు. అంకమరాజు మరణించిన 1,700 ఏళ్ల క్రితం సమాధి, వీరాంజనేయ స్వామి, మహంకాళిమాత దేవతలున్నా నేటికీ ఆలయ అభివృద్ధిని అధి కారులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు ప ట్టించుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇ ప్పటికై నా చొరవ చూపి అంకమరాజు, వీరాంజనేయస్వామి, మహంకాళి మాత గుడి నిర్మించేలా చ ర్యలు తీసుకోవాలని కోరారు. ఆలయ నిర్మాణం కో సం త్వరలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement