ఘనంగా టీజీఎఫ్‌డీసీ ఆవిర్భావ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా టీజీఎఫ్‌డీసీ ఆవిర్భావ వేడుకలు

May 15 2026 10:38 AM | Updated on May 15 2026 10:38 AM

కాగజ్‌నగర్‌: తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీఎఫ్‌డీసీ) ఆవిర్భావ వేడుకలు గురువారం కాగజ్‌నగర్‌లోని ఆ సంస్థ డివిజన్‌ కార్యాలయ ఆవరణలో ఘనంగా జరుపుకొన్నారు. డివిజన్‌ పరిధిలోని కాగజ్‌నగర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల రేంజ్‌ల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు క్రీడాపోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డివి జనల్‌ మేనేజర్‌ గణేష్‌ మాట్లాడుతూ టీజీఎఫ్‌ డీసీ పురోగతి కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. ప్లాంటేషన్లు, అటవీ ప్రాంతాల్లో పని చేసే సిబ్బందికి క్రీడాపోటీలు నిర్వహించ డం ద్వారా బృంద నాయకత్వం, మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో ప్లాంటేషన్‌ మేనేజర్లు గోగు సురేశ్‌(మంచిర్యాల రేంజ్‌), ఎడ్ల లక్ష్మణ్‌(కాగజ్‌నగర్‌ రేంజ్‌), ఎ.జలపతి(బెల్లంపల్లి రేంజ్‌), సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement