భీం పోరాటం ప్రజలకు స్ఫూర్తి | - | Sakshi
Sakshi News home page

భీం పోరాటం ప్రజలకు స్ఫూర్తి

May 4 2026 7:37 AM | Updated on May 4 2026 7:37 AM

కెరమెరి: కుమురంభీం పోరాటం ప్రజలకు స్ఫూర్తి దాయకమని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. కెరమెరి మండలం జోడేఘాట్‌లోని భీం విగ్రహానికి ఆదివారం జిల్లా గిరిజన సంక్షేమ అధికా రి రమాదేవితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాధిపై పూలు చల్లి పూజలు చేశారు. ఆదివాసీల ఆభరణాలు, వాయిద్యాలు, ఫొటో గ్యా లరీ, గుస్సాడీ నృత్యాల ప్రతిమలను తిలకించారు. గ్రామస్తులు ఆయనను శాలువాతో సత్కరించారు. భీం ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్‌ పెందుర్‌ రాజేశ్వర్‌, మ్యూజియం క్యూరేటర్‌ ఆడె దుందేరావు, ప్రధానోపాధ్యాయులు ఆత్రం మోతీరాం, కురం జంగు, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

ఆదివాసీల ఆత్మబంధువు హైమన్‌డార్ఫ్‌

ఆసిఫాబాద్‌: ఆదివాసీల ఆత్మబంధువులు ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్‌, జెట్టి ఎలిజబెత్‌ దంపతులని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. జైనూర్‌ మండలం మార్లవాయిలోని డార్ఫ్‌ దంపతులు, కుమురంభీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డార్ఫ్‌ మ్యూజియం, రీడింగ్‌ లైబ్రరీ, కాటేజ్‌, గుస్సాడీ శిక్షణ కేంద్రం, గోండ్వానా పంచాయతీరాజ్‌ సెంటర్‌, దర్బార్‌ స్థలం, 1941లో డార్ఫ్‌ దంపతులు నివసించిన ప్రదేశం, ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చిన మహనీయులు ఆదివాసీల సంక్షేమం కోసం చేసిన కృషి అభినందనీయమన్నారు. అంతకుముందు గ్రామస్తులు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. డార్ఫ్‌ దంపతుల చిత్రపటం, నివేదిక పుస్తకం అందించి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, జైనూర్‌ ఏటీడీవో శ్రీనివాస్‌, సర్పంచ్‌ కనక ప్రతిభ వెంకటేశ్వర్‌రావు, గ్రామస్తులు ఆత్రం మాణిక్‌రావు, దేవరీ కనక గణపత్‌, ఆత్రం రాజేశ్వర్‌, జైనూర్‌ ఏఎంసీ డైరెక్టర్‌ లింగు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement