ఆసిఫాబాద్: జిల్ల కేంద్రంలో రూ.1.20 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి స్థానిక కొట్నాక భీమ్‌రావు పిల్లల పార్కులో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రంలో షాపింగ్ కాంప్లెక్స్, షాదీఖానా, పిల్లల పార్క్ అభివృద్ధి పనులు చేపట్టనున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, వైస్ చైర్మన్ అహ్మద్, కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, సాలంబిన్ అహ్మద్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.


