15న దేశవ్యాప్త సమ్మె | - | Sakshi
Sakshi News home page

15న దేశవ్యాప్త సమ్మె

May 12 2026 5:36 AM | Updated on May 12 2026 5:36 AM

కాగజ్‌నగర్‌రూరల్‌: మే 15న దేశవ్యాప్త జాతీ య గ్రామీణ సమ్మె చేపడుతున్నట్లు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్‌ ముంజం ఆనంద్‌కుమార్‌ తెలిపారు. మండలంలోని తుంగమడుగు గ్రామంలో ఉపాధిహామీ పని ప్రదేశాన్ని సోమవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ మే 15 జాతీయ గ్రామీణ సమ్మె, మే 20 కలెక్టరేట్‌ ముట్టడిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పని ప్రదేశంలో కనీస వసతులు లేకపోవడంతో ఎంపీడీవో ఉజ్వల్‌ కుమార్‌కు సమాచారం అందించారు. పని ప్రదేశంలో తాగునీరు, టెంట్లు, మెడికల్‌ కిట్లు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement