యోగా పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

యోగా పోటీలకు ఎంపిక

May 2 2026 8:08 AM | Updated on May 2 2026 8:08 AM

రెబ్బెన: యోగాసన భారత్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వ రల్డ్‌ యోగాసన చాంపియన్‌షిప్‌ పోటీలకు జిల్లాకు చెందిన చెల్లుబోయిన ఏడుకొండలు ఎంపికైనట్లు యో గాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కేసరి ఆంజనేయులుగౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. హర్యానాలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ట్రైనింగ్‌ సెంటర్‌లో శనివారం జరిగే కీలక పోటీల్లో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. సీనియర్‌ బీ విభాగం సింగిల్‌ లెగ్‌ బ్యాలెన్స్‌ ఆసనాల పోటీలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపితే దేశం తరఫున ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనే అరుదైన అవకాశం దక్కుతుందని తెలిపారు. అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కొలిపాక కిరణ్‌కుమార్‌, రాష్ట్ర యోగా అసోసియేషన్‌ ప్రతినిధులు ఆయనను అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement