మెరుగైన వసతుల కల్పనే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వసతుల కల్పనే లక్ష్యం

May 12 2026 5:36 AM | Updated on May 12 2026 5:36 AM

రెబ్బెన: విద్యార్థినుల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. మండలంలోని గంగాపూర్‌ కేజీబీవీలో సోమవారం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యా వారోత్సవాలు ప్రారంభించారు. ఎమ్మె ల్యే కోవ లక్ష్మితో కలిసి అదనపు తరగతి గదుల నిర్మాణం, బాలికలకు ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పా టు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. సీ ఎస్‌ఆర్‌, ఉపాధిహామీ, సర్వశిక్ష అభియాన్‌ నిధులతో జిల్లాలోని ప్రతీ పాఠశాలలో వసతులను కల్పి స్తున్నామని తెలిపారు. పదో తరగతి, ఇంటర్‌ అడ్వా న్స్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తరగతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. అనంతరం తుంగెడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పా టు చేసిన ప్రీ ఫ్యాబ్రిక్‌ టాయిలెట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ కార్నాథం సంజీవ్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ రంగు మహేశ్‌గౌడ్‌, తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌, ఎంపీడీవో శంకరమ్మ, సర్పంచులు వెంకటేశంచారి, భరద్వాజ్‌, బుచ్చక్క, మాదాసు రవీందర్‌, ఉప సర్పంచ్‌ వరలక్ష్మి దుర్గారావు, మాజీ సర్పంచ్‌ వినోద పాల్గొన్నారు.

15 రోజుల్లో ఓటరు మ్యాపింగ్‌ పూర్తిచేయాలి

ఆసిఫాబాద్‌: 15 రోజుల్లో ఓటర్ల సమగ్ర సవరణ ఓటర్ల మ్యాపింగ్‌ 90 శాతం పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎలక్టోరల్‌ అధికారి సుదర్శన్‌ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. గ్రామం వదిలి వెళ్లిన, మరణించిన ఓటర్ల వివరాలను నోటీసులు జారీ చేసి తొలగించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి కాగజ్‌నగర్‌ సబ్‌కలెక్టర్‌ శ్రద్దా శుక్లాతో కలిసి కలెక్టర్‌ కె.హరిత హాజరయ్యారు. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. ఎస్‌హెచ్‌జీ మహిళల సహకారంతో మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. సమావేశంలో తహసీల్దా ర్లు రియాజ్‌ అలీ, సూర్యప్రకాశ్‌, కవిత, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు జమీల్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement