ఆసిఫాబాద్‌రూరల్: పార్కింగ్‌కు సమస్యకు వినూత్న పరిష్కారం చూపిన జిల్లాకు చెందిన విద్యార్థి మమతతోపాటు గైడ్ టీచర్ కేశవ్, జిల్లా సైన్స్ అధికారి మధుకర్‌ను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ ప్రత్యేకంగా అభినందించారు. పార్కింగ్ మేనేజ్‌మెంట్ ఇన్ క్రౌడెంట్ ప్లేస్ అనే డిజైన్‌కు ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం నుంచి అధికారిక నమోదు లభించడం జిల్లాకు గర్వకారణమన్నారు. జిల్లాలో విద్యార్థులు, యువతకు ఇది ప్రేరణగా నిలుస్తుందన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థికి జాతీయస్థాయిలో గుర్తింపు దక్కడం విశేషమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈవో లలిత పాల్గొన్నారు.


