విద్యతోనే సామాజిక అవగాహన | - | Sakshi
Sakshi News home page

విద్యతోనే సామాజిక అవగాహన

May 8 2026 12:25 PM | Updated on May 8 2026 12:25 PM

వాంకిడి: విద్యతోనే సామాజిక అవగాహన పెరుగుతుందని డీఆర్‌డీవో దత్తారావు అన్నా రు. వాంకిడి మండలం ఖమానలోని రైతువేదికలో గురువారం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళా సాధి కారత కేంద్రం ఆధ్వర్యంలో కిశోర బాలికలు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. బాలికలు చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. కిశోర బాలికల కోసం ప్రత్యేక సమ్మర్‌ క్యాలెండర్‌ తీసుకువచ్చామని తెలిపారు. అంతకుముందు బాల్య వివాహాలు, మహిళల అక్రమ రవాణా, ప్రేమ పేరుతో మోసాలు, గుడ్‌ టచ్‌– బ్యాడ్‌ టచ్‌, ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యం, పౌష్టికాహారం, రక్తహీనతకు కారణాలు తదితర అంశాలపై మహిళా సాధి కారత కేంద్రం డీఎంసీ శారద, జెండర్‌ స్పెషలిస్ట్‌ రాణి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీపీఎంలు రామకృష్ణ, యాదగిరి, ఏపీఎం ధన్‌రాజ్‌, సీసీలు భీంరావు, రమేశ్‌, వీవోలు ఆనంద్‌రావు, మోహన్‌, బాపురావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement