పెరుగుతున్న ఎండ తీవ్రతను భరించలేకపోతున్నాం. ప్రతిరోజూ రెబ్బెన మండలం కొండపల్లి గ్రామం నుంచి పండించిన దోసకాయలు తీసుకువచ్చి విక్రయిస్తుంటా. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాపారం చేస్తే రూ.1000 వరకు గిరాకీ అయితది. నీడ కోసం రోడ్డు పక్కనే గొడుగు ఏర్పాటు చేసుకున్నా. ప్రభుత్వం స్పందించి పక్కా షెడ్లు నిర్మించి ఇవ్వాలి.
– ప్రేమల్
ఎండకు నీరసం
వాంకిడి మండలం బెండారా గ్రామం నుంచి సొంతంగా పండించిన దోసకాయలు, కందగడ్డలు విక్రయించేందుకు ఆసిఫాబాద్ పట్టణానికి వస్తా. జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ రోడ్డు పక్కనే వ్యాపారం చేసుకుంటా. సాయంత్రం 4 గంటల వరకు ఎండలోనే ఉండి ఇంటికి వెళ్లిన తర్వాత నీరసంగా ఉంటుంది. మున్సిపల్ అధికారులు చిరువ్యాపారులకు సౌకర్యాలు కల్పించాలి. – సెండె భీంరావ్
సల్లటి నీళ్లు కూడా ఉండవ్..
కాగజ్‌నగర్ మండలం ఈస్‌గాం నుంచి తాటిముంజలను తీసుకువచ్చి ఆసిఫాబాద్‌లో అమ్ముతుంటా. రోజుకు సుమారుగా 200 ముంజలు అమ్ముడుపోతాయి. సాయంత్రం వరకు ఎండలోనే వడగాలులకు వ్యాపారం చేసుకోవాల్సి వస్తుంది. సల్లటి నీళ్లు కూడా ఉండవ్.. దినమంతా వేడి నీళ్లనే తాగాలి. పక్కా షెడ్లు ఇస్తే కాస్త ఉపశమనంగా ఉంటుంది. – బిశ్వజిత్ మండల్


