నేడు పాలిసెట్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు పాలిసెట్‌

May 13 2026 2:02 AM | Updated on May 13 2026 2:02 AM

● నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ ● హాజరుకానున్న 1,064 మంది విద్యార్థులు

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లాలో బుధవారం పాలిసెట్‌ నిర్వహించనున్నారు. నాలుగు పరీక్ష కేంద్రాల్లో 1,064 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో బాలురు 551 మంది, బాలికలు 513 మంది ఉన్నారు. వాంకిడి మండలంలోని బెండార బాలికల డిగ్రీ కళాశాలలో 252 మంది, ఆసిఫాబాద్‌లో మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో 240 మంది, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో 332 మంది, గిరిజన బాలికల గురుకుల కళాశాలలో 240 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష జరగనుంది. గంట ముందుగానే సెంటర్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. నిర్దేశిత సమయం కంటే నిమిషం అలస్యమైనా కేంద్రంలోకి అనుమతి ఉండదు. ఎలక్ట్రానిక్‌ వస్తువులు, వాచీలు, మొబైళ్లకు అనుమతి లేదు. పరీక్ష ప్యాడ్‌, హెచ్‌బీ పెన్సిల్‌, ఎరైజర్‌, షార్ప్‌నర్‌, బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌పెన్‌, ఆధార్‌ కార్డు, హాల్‌ టికెట్‌ మాత్రమే వెంట తెచ్చుకోవాలని జిల్లా పరీక్షల నిర్వహణ కోఆర్డినేటర్‌ కనకయ్య సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement