పట్టుకొట్టైలో రూ.20 కోట్లతో బస్టాండ్‌ | - | Sakshi
Sakshi News home page

పట్టుకొట్టైలో రూ.20 కోట్లతో బస్టాండ్‌

Feb 16 2026 7:43 AM | Updated on Feb 16 2026 7:43 AM

పట్టుకొట్టైలో రూ.20 కోట్లతో బస్టాండ్‌

పట్టుకొట్టైలో రూ.20 కోట్లతో బస్టాండ్‌

● ప్రారంభించిన ఉదయనిధి స్టాలిన్‌

సాక్షి, చైన్నె: తంజావూరు జిల్లా పట్టుకొట్టై పట్టణంలో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త బస్టాండ్‌ను డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ ఆదివారం ప్రారంభించారు. కొత్త బస్సులకు జెండా ఊపారు. తంజావూరు జిల్లాలోని పట్టుకొట్టై నగర పాలక సంస్థ పరిధిలో 6.50 ఎకరాల విస్తీర్ణంలో ఈ బస్‌ స్టాండ్‌ నిర్మించారు.50 బస్సులు నిలిపే సామర్థ్యం, 120 వాణిజ్య దుకాణాలు, 2 పుట్‌కోర్ట్‌లు, 3 ప్రయాణీకుల విశ్రాంతి గదులు, తదితర ఏర్పాట్లు ఇక్కడ చేశారు. ఈ ప్రారంభోత్సవానికి హాజరైన ఉదయ నిధి సాలలిన్‌ మాట్లాడుతూ, అందరికీ అన్నీ అన్నది ద్రావిడ మోడల్‌ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పట్టుకోట్టై పట్టణంలో 35 కిలోమీటర్ల మేరకు రహదారుల నిర్మాణం, రూ.7.50 కోట్లతో చెరువుల అభివృద్ధి, రూ.22 కోట్లతో మురికి నీటి శుద్ధికరణ కేంద్రం, రూ.5 కోట్లతో ఘన వ్యర్థాల నిర్వహణ, రూ.4.50 కోట్లతో పాఠశాల గదులు నిర్మాణం, రూ.1.50 కోట్లతో జ్ఞాన కేంద్రం ఏర్పాటు వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement