లంకేశ్వరుడిపై లయకారుడు
ఏకాదశి ఉత్సవంలో కల్యాణ వెంకన్న
నారాయణవనం : పద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం ఉత్సవర్లు మాడవీధి ఉత్సవంలో భక్తుల నుంచి హారతులు అందుకున్నారు. సాయంత్రం తిరుచ్చి వాహనంపై శ్రీదేవీ, భూదేవీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి తిరుచ్చి వాహనం అధిరోహించి, మాడవీధుల్లో విహరించారు. ఏకాదశి ఉత్సవం సందర్భంగా శుక్రవారం పద్మావతీ అమ్మవారి ఊంజల్‌సేవను రద్దు చేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారి నాగరాజు, ఆర్జితం అధికారి భరత్, అర్చకులు పర్యవేక్షించారు.
శ్రీవారి దర్శనానికి 12గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 61,632 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 24,435 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.28కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
అసుర జాతిలో పుట్టిన రావణుడు బ్రహ్మణోత్తముడు..అత్యంత శివభక్తి పారాయణుడు. కై లాసాన్ని తన శిరస్సుకెక్కించుకుని.. రుద్రవీణాగానంతో పరమేశ్వరుడిని మెప్పించిన భక్తాగ్రేసరుడు. అందుకే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గాంధర్వరాత్రిని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ముక్కంటీశ్వరుడు ధశకంఠుడిపై అధిరోహించాడు. స్వామివారి దేవేరి జ్ఞానప్రసూనాంబ మయూర వాహనాన్ని అధిరోహించి, భక్తులకు దివ్యదర్శనం కల్పించారు. వినాయకుడు మూషిక వాహనంపై, శ్రీవల్లీ–దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండీకేశ్వరస్వామి, భక్త కన్నప్ప స్వామి, అమ్మవార్లను అనుసరించారు. ఉదయం శ్రీకాళహస్తీశ్వరుడు హంస వాహనంపై, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు బంగారు యాళి వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. మూషిక వాహనంపై వినాయకస్వామి, చప్పరాలపై కుమారస్వామి, చండికేశ్వరుడు, భక్త కన్నప్ప కొలువుదీరారు. కళాకారుల కోలాటాలు, నందుల వాయిద్యాలు, శివనామస్మరణతో శ్రీకాళహస్తీశ్వర ఆలయ పరిసరాలు మార్మోగాయి. –శ్రీకాళహస్తి
లంకేశ్వరుడిపై లయకారుడు
లంకేశ్వరుడిపై లయకారుడు


