ముగిసిన పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Feb 16 2026 7:43 AM | Updated on Feb 16 2026 7:43 AM

ముగిసిన పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

ముగిసిన పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

● నేత్రపర్వంగా చక్రస్నానం ● నేడు పుష్పయాగం

కొరుక్కుపేట: చైన్నె, టి.నగర్‌ జీఎన్‌ చెట్టిరోడ్డులో కొలువుదీరిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారంతో వైభవంగా ముగిశాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి రోజు కావడంతో శ్రీ పద్మావతి అమ్మవారికి ఆలయ ప్రధానార్చకులు, వైష్ణ వ పండితుల మంత్రోచ్చారణలతో పూజలతో పాటూ చక్రస్నానం నిర్వహించారు. పెద్దసంఖ్య భక్తులు పాల్గొని చక్రస్నానం కనులారా తిలకించి తరించారు. భక్తులు గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మ రణలు ఆలయ ప్రాంగణం మారుమోగింది. రాత్రి 7 గంటలకు ధ్వజ అవరోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా ముగించారు. ఈ వేడుకల్లో ఆలయ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ధనుంజయ్‌, సూపరింటెండెంట్‌ పుష్పలత, టీటీడీ స్థానిక సలహా మండలి మాజీ అధ్యక్షులు ఎన్‌. శ్రీకష్ణ, మాజీ సభ్యులు పీవీఆర్‌ కష్ణారావు, మోహన్‌ రావు, రంగారెడ్డి, జయదేవ్‌, అజయ్‌, సుబ్రహ్మణ్యం, కార్తీక్‌, శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్‌, పరసురామన్‌ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా ఈనెల 16వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారికి పుష్పయాగం నిర్వహించనున్నట్టు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement