కనులపండువగా మహాకుంభాభిషేకం
పళ్లిపట్టు: కొత్తూరులో మూడు ఆలయాల మహాకుంభాభిషేకం ఆదివారం కనులపండువగా నిర్వహించారు. పళ్లిపట్టు యూనియన్‌లోని కొత్తూరు గ్రామంలోని కమల వినాయకుడి ఆలయం, రాధ, రుక్మణి సమేత వేణుగోపాలస్వామి ఆలయం, గంగమ్మతల్లి ఆలయాలకు మహాకుంభాభిషేకం పూర్తిచేసి 15 సంవత్సరాలు పూర్తికావడంతో జీర్ణోద్ధరణ పనులు పూర్తిచేసి శుక్రవారం నుంచి ఆదివారం వరకు మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో యాగశాలలు ఏర్పాట్లు చేసి నిత్యహోమగుండ పూజలు చేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతి పూజలు అనంతరం మేళ తాళాల నడుమ పవిత్ర పుణ్యతీర్థాల కలశాలు ఊరేగింపుగా వచ్చి కమల వినాయకుడి ఆలయ విమాన గోపురానికి పవిత్ర పుణ్యతీర్థాలతో మహాకుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం వేణుగోపాలస్వామి ఆలయ గోపురం, చివరగా గంగమ్మ ఆలయ మహాకుంభాభిషేకం నిర్వహించారు. కుంభాభిషేకం నిర్వహించిన పుణ్యతీర్థాలను భక్తులపై చల్లారు. అనంతరం స్వామివారికి కర్పూర అభిషేక పూజలు చేసి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేసి అన్నదానం చేశారు. కొత్తూరు గ్రామస్తులు మహాకుంభాభిషేకాన్ని విజయవంతంగా నిర్వహించారు.
కనులపండువగా మహాకుంభాభిషేకం
కనులపండువగా మహాకుంభాభిషేకం


