వాహనాలకు క్రిమిసంహారక మందుల పిచికారీ
వేలూరు: ఆంధ్ర సరిహద్దు ప్రాంతం నుంచి వస్తున్న వాహనాలకు క్రిమి సంహారక మందులు పిచకారీ చేసిన తర్వాతే తమిళనాడుకు అనుమతిస్తున్నారు. బర్డ్‌ఫ్లూ వ్యాప్తిని నివారించడానికి ఆంధ్ర రాష్ట్రం నుంచి వేలూరు వైపునకు వచ్చే వాహనాలకు వేలూరు జిల్లా కాట్పాడి సమీపలోని క్రిష్టియన్‌పేట వద్ద ఉన్న ఆంధ్ర సరిహద్దు వద్ద క్రిమి సంహారక మందులు చల్లి అనుమతించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. బర్డ్‌ఫ్లూ ఈ నేపథ్యంలో బర్డ్‌ప్లూ వ్యాధిని నివారించేందుకు పశుసంవర్థక శాఖ డాక్టర్ సురేందర్, వైద్య సిబ్బంది బృందం ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేసి వాటికి క్రిమి సంహారక నివారణ మందులను చల్లి అనుమతిస్తున్నారు. అదేవిధంగా ధ్రా సరిహద్దులో ఉన్న సేర్‌కాడు, పరదరామి, బత్తలపల్లి వంటి చెక్‌పోస్టుల వద్ద కూడా క్రిమి సంహారక నివారణ మందులు చల్లిన అనంతరమే వాహనాలను అనుమతిస్తున్నారు.


