దశాబ్దాలుగా విసనకర్రల తయారీ
వీసీఎన్ కండ్రిగ వాసులు
వేసవి కాలం ప్రారంభానికి ముందుగానే తిరుత్తణి సమీపం వీసీఎన్ కండ్రిగ గ్రామంలో సందడి నెలకొంది. గ్రామంలోని వంద కుటుంబాలకు చెందిన ప్రజలు విసనకర్రల తయారీలో బిజిబిజీగా ఉంటున్నారు. ఇక్క పెద్దగా ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా, ప్రజల నుంచి ఆదరణ కొరవడిగా తమ పూర్వికులు చూపిన పని మాత్రం వీడకుండా నేటికీ కొనసాగిస్తున్నారు. తిరుత్తణి యూనియన్‌లోని కొండ గ్రామం వీసీఎన్ కండ్రిగ వాసులు నేటికి పూరె గుడిసెలు, సిమెంట్ షీట్లు ఉండే ఇళ్లలో నివశిస్తున్నారు. దశాబ్దాలుగా వారి ప్రధాన వృత్తి విసనకర్రలు తయారు చేసి గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయించడం. తద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబం పోషిస్తూ హాయిగా జీవితం గడుపుతున్నారు. కాగా వేసవి కాలం ప్రారంభం కావడంతో వినకర్రల విక్రయాలు పెరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. –పళ్లిపట్టు
దశాబ్దాలుగా విసనకర్రల తయారీ


