రాష్ట్రంలో 6 కొత్త నర్సింగ్‌ కళాశాలలు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో 6 కొత్త నర్సింగ్‌ కళాశాలలు

Feb 10 2026 7:31 AM | Updated on Feb 10 2026 7:31 AM

రాష్ట్రంలో 6 కొత్త నర్సింగ్‌ కళాశాలలు

రాష్ట్రంలో 6 కొత్త నర్సింగ్‌ కళాశాలలు

● ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్‌ వెల్లడి

సాక్షి, చైన్నె: రాష్ట్రంలో త్వరలో ఆ రు కొత్త నర్సింగ్‌ కశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్‌ తెలిపారు. నర్సింగ్‌ కళాశాలలో చదువుకున్న 1,100మంది కి డిగ్రీలను ప్రదానం చేశారు. చైన్నెలోని తమిళనాడు డాక్టర్‌ ఎంజిఆర్‌ వైద్య విశ్వవిద్యాలయంలో నర్సింగ్‌ విద్యార్థులకు స్నాతకోత్సవం సోమవారం జరిగింది. ఇందులో కోర్సులు పూర్తి చేసిన పట్టభద్రులకు డిగ్రీలను అందజేశౠరు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్య కళాశాలల్లో వైద్యులకు బ్యాచిలర్‌ డిగ్రీల స్నాతకోత్సవాలు జరుగుతాయన్నారు. అదే విధంగా నర్సింగ్‌ కోర్సులు పూర్తిచేసిన వారికి కూడా స్నాతకోత్సవం నిర్వాహించాలన్న డిమాండ్‌ చాలా కాలంగా ఉంటూ వచ్చిందన్నారు. గత సంవత్సరం నుంచి నర్సింగ్‌ కళాశాలలో స్నాతకోత్సవాలు నిరంతరం జరుగుతున్నాయి. తాజాగా 1,100 మంది నర్సులు పట్టభద్రులయ్యారని పేర్కొన్నారు. వీరిలో డిప్లొమా నర్సింగ్‌– 949, బి.ఎస్‌.సి. నర్సింగ్‌– 75, ఎం.ఎస్‌.సి. నర్సింగ్‌– 64, నర్సింగ్‌ మిడ్‌వైఫ్‌ ఆక్సిలరీ– 16 మంది పూర్తిచేశారని వివరించారు. రాష్ట్రంలో 6 కొత్త ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలు త్వరలో ప్రారంభం కానున్నాయని ప్రకటించారు. ఇవి తిరునెల్వేలి, తిరుచ్చి, ధర్మపురి, వెల్లూరు, ఈరోడ్‌, తిరువణ్ణామలైలో ఏర్పాటు కానున్నట్టు వివరించారు. ప్రస్తుత ప్రభుత్వ నర్సుల సంఖ్యను పెంచిందని పేర్కొంటూ,కరోనా కాలంలో పనిచేసిన 719మందిని కాంట్రాక్టు నర్సులకు మరి కొద్ది రోజులలో పర్మినెంట్‌ ఉత్తర్వులను అందజేయనున్నామన్నారు. ఈ ప్రభుత్వంలో 8,834 మంది కాంట్రాక్ట్‌ నర్సులకు తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. కొత్తగా ఏర్పాటు కానున్న ప్రస్తుతం ఉన్న 6 ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలల్లో 450 బి.ఎస్‌.సి., 80 పోస్ట్‌ బేసిక్‌, 101 పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు చదువుతున్నారని వివరించారు. అలాగే, 25 నర్సింగ్‌ శిక్షణ పాఠశాలల్లో 2,060 మంది విద్యార్థులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement