సైబర్‌ భద్రతపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ భద్రతపై అవగాహన అవసరం

Feb 16 2026 7:43 AM | Updated on Feb 16 2026 7:43 AM

సైబర్‌ భద్రతపై అవగాహన అవసరం

సైబర్‌ భద్రతపై అవగాహన అవసరం

తిరువళ్లూరు: సైబర్‌ భద్రతపై అవగాహన అవసరమ ని ఎఫ్‌–సిడాక్‌ శాస్త్రవేత్త దిజా అన్నారు. తిరువళ్లూరు జిల్లా ఆవడిలోని వేల్‌టెక్‌ వర్సిటీలో ఏఐ వర్సెస్‌ సైబర్‌ సెక్యూరిటీపై రెండు రోజుల సదస్సు జరిగింది. కార్యక్రమానికి వర్సిటీ వ్యవస్థాపక అద్యక్షుడు డాక్టర్‌ రంగరాజన్‌ అధ్యక్షత వహించారు. సదస్సులో దిజా, జోకో సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామనాథన్‌, డీజీ అలర్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు వినోద్‌సెంథిల్‌, డాక్టర్‌ ప్రభాక రన్‌ హాజరై ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ వర్సెస్‌ సైబర్‌ సెక్యూరిటి అనే అంశంపై సదస్సులో చర్చించారు. సై బర్‌ నేరాల ద్వారా వచ్చే బెదిరింపులు, రక్షణ, ఎథిక్స్‌ ను ఎలా రక్షించుకోవాలనే అంశంపై చర్చించారు. స మాజానికి సైబర్‌ భద్రతపై మరింత అవగాహన పెంచాలని దిజా సూచించారు. కళాశాల సీఎస్‌ఈ హెచ్‌ఓ డీ రాజేంద్రన్‌, కోఆర్డినేటర్‌ మహ్మద్‌ సిద్ధిక్‌, చొక్కలింగం, అసోసియేట్‌ డీన్‌ దిలీప్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement