మధురైలో భారీ వావుసీ చిదంబరం విగ్రహం | - | Sakshi
Sakshi News home page

మధురైలో భారీ వావుసీ చిదంబరం విగ్రహం

Feb 10 2026 7:30 AM | Updated on Feb 10 2026 7:30 AM

మధురైలో భారీ వావుసీ చిదంబరం విగ్రహం

మధురైలో భారీ వావుసీ చిదంబరం విగ్రహం

●ఏసీ షణ్ముగం వెల్లడి

కొరుక్కుపేట: స్వాతంత్య్ర సమరయోధులు వావుసీ చిదంబరంకు మధురైలో 110 అడుగుల ఎత్తులో భారీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు డాక్టర్‌ ఎంజీఆర్‌ యూనివర్సిటీ చాన్స్‌లర్‌, ఏసీఎస్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు డాక్టర్‌ ఏసీ షణ్ముగం తెలిపారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ఆవిష్కరిస్తారని ఆయన వెల్లడించారు. చైన్నెలో మీడియాతో ఇంకా మాట్లాడుతూ భారతదేశంలో బానిసత్వ సంకెళ్లను తెంచడానికి దక్షిణాదిలోని తూత్తుకుడి జిల్లాలో ఉద్భవించిన చిదంబరం పిళ్లై, తెల్ల సామ్రాజ్యవాదానికి సింహస్వప్నం అయ్యాడన్నారు. ఆయన కీర్తిని స్మరించుకునేందుకు ఆయనకు 110 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఏసీఎస్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్ణయించింది. ఈ ప్రత్యేక కార్యక్రమం 22వ తేదీ ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో జరుగుతుంది. భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహానికి పునాది రాయి వేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఏసీఎస్‌ ఫౌండేషన్‌ తరపున మధురైలో 110 అడుగుల ఎత్తయిన చిదంబర పిళ్ళై విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న నమూనాను ఆవిష్కరించారు. న్యూ జస్టిస్‌ పార్టీ వర్కింగ్‌ లీడర్‌ రవికుమార్‌ ,. ఓం శక్తి రామచంద్రన్‌, ఎస్‌ జె . ప్రకాష్‌, ఎన్‌ లోకనాథన్‌,జి వెంకటేష్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement