క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌

Feb 14 2026 7:57 AM | Updated on Feb 14 2026 7:57 AM

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌

కొరుక్కుపేట: క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌ లభిస్తుందని చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ వి.ఎస్‌ రాహుల్‌ అన్నారు. వేణుగోపాల్‌ విద్యాలయ మెట్రిక్యులేషన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ 45వ వార్షిక స్పోర్ట్స్‌మీట్‌ చైన్నె ఎగ్మూర్‌లోని రాజారత్నం స్టేడియంలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 91వ చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ వి.ఎస్‌. రాహుల్‌ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి స్పోర్ట్స్‌ మీట్‌ను ప్రారంభించారు. ముందుగా తెలుగు మహాజన సమాజం అధ్యక్షుడు కె. అనిల్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలుపుతాయని అన్నారు. అనంతరం చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ వి.ఎస్‌. రాహుల్‌ క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులను అభినందించారు. ఆయన మాట్లాడుతూ ఆసక్తి ఉన్న క్రీడలో సాధన చేయగలిగితే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ముగింపు వేడుకలో విజేతలు, ఉత్తమ అథ్లెట్లకు పతకాలు ట్రోఫీలను ప్రదానం చేశారు. ఇందులో పాఠశాల కార్యదర్శి, కరస్పాండెంట్‌ వి.గోవింద్‌, ఉపాధ్యక్షుడు ఆనందకుమార్‌రెడ్డి, వైస్‌ ప్రిన్సిపల్‌.ఆర్‌. ఇలంగో, హెచ్‌ఎం వి. షీలా, కో–ఆర్డినేటర్‌ లేఖ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ట్రైనర్‌ ఢిల్లీబాబు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement