8 వేల రోబో శస్త్ర చికిత్సలతో అపోలో అరుదైన రికార్డు | - | Sakshi
Sakshi News home page

8 వేల రోబో శస్త్ర చికిత్సలతో అపోలో అరుదైన రికార్డు

Feb 13 2026 3:37 AM | Updated on Feb 13 2026 3:37 AM

8 వేల రోబో శస్త్ర చికిత్సలతో అపోలో అరుదైన రికార్డు

8 వేల రోబో శస్త్ర చికిత్సలతో అపోలో అరుదైన రికార్డు

కొరుక్కుపేట : చైన్నె నగరంలోని అపోలో హాస్పిటల్స్‌ 8 వేలకు పైగా రోబో సహాయక శస్త్రచికిత్సలు నిర్వహించి సరికొత్త రికార్డు నెలకొల్పినట్లు అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ వైస్‌ చైర్పర్సన్‌ డాక్టర్‌ ప్రీతారెడ్డి తెలిపారు. ఈ శస్త్రచికిత్సలు రోగులకు 50 శాతం రక్తస్రావాన్ని తగ్గిస్తుందని, అంతే కా కుండా 1, 2 రోజులు మాత్రమే ఆసుపత్రిలో గడిపి త్వరగా డిశ్చార్జ్‌ అవుతారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎనిమిది వేలకు పైగా రోబోటిక్‌ సహాయ క శస్త్రచికిత్సలు చేసిన ఏకై క ఆసుపత్రిగా అపోలో హాస్పిటల్స్‌ పేరుగడించిందని తెలిపారు. అపోలో హాస్పిటల్స్‌ స్ట్రాటజీ డైరెక్టర్‌ సింధూరీ రెడ్డి మాట్లాడుతూ రోగి రోగ లక్షణాలను బట్టి ఆయా రోగాల కు అనువైన రోబోటిక్‌ పరికరాలను ఉపయోగించి వైద్యనిపుణులు శస్త్రచికిత్సలందిచారని అన్నారు. రోబోటిక్‌ సర్జరీల ద్వారా యూరాలజీ, గైనకాలజీ, లేప్రోస్కోపిక్‌, ఆర్థోపెడిక్స్‌, ఆంకాలజీ సంబంధిత శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అపోలో ఆసుపత్రి వైద్యు లు పాల్గొని రోబో శస్త్రచికిత్సల గురించి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement