హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు
తిరువళ్లూరు: స్నేహితుడి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా వున్న యువకుడికి జీవితఖైదు శిక్షను విధిస్తూ తిరువళ్లూరు జిల్లా కోర్టు తీర్పును వెలువరించింది. తిరువళ్లూరు జిల్లా పెద్దపాళ్యంలో వసంతం ఎంటర్‌ప్రైజస్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థఽలో 30 మందిపైకి పనిచేస్తున్నారు. వీరిలో మంజుత్, గోకుల్, మేను, దేవజిత్ స్నేహితులు. ఈక్రమంలో 2019వ సంవత్సరంలో పెద్దపాళ్యంలోని ఆర్కాడు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ సమీపంలో నలుగురు మద్యం తాగే విషయంగా వీరి మద్య ఘర్షణ చోటుచేసుకుంది. మంజుత్, దేవజిత్, మేను కలిసి గోకుల్‌ను హత్య చేశారు. పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన ముగ్గురు విచారణకు హాజరు కావాల్సి వుండగా మంజుత్, మేనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దేవజిత్ మాత్రం విచారణకు హాజరవుతూ వచ్చాడు. విచారణ పూర్తయిన క్రమంలో నేరం రుజువు కావడంతో దేవజిత్‌కు జీవితఖైదు శిక్షను విధిస్తూ తిరువళ్లూరు జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తి తీర్పును విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


