ఏదీ మన చేతల్లో ఉండదు ! | - | Sakshi
Sakshi News home page

ఏదీ మన చేతల్లో ఉండదు !

Feb 12 2026 1:21 PM | Updated on Feb 12 2026 1:21 PM

ఏదీ మన చేతల్లో ఉండదు !

ఏదీ మన చేతల్లో ఉండదు !

తమిళసినిమా: అంతిల్‌ సినిమా, పలంపూర్‌ టాకీస్‌ సంస్థలు కలసి నిర్మించిన చిత్రం ఓ బటర్‌ ఫ్లై. ఈచిత్రం ద్వారా విజయ్‌ రంగనాథన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇంతకుముందు కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేసి, ఆ తర్వాత కొన్ని షార్ట్‌ ఫిలిమ్స్‌ రూపొందించి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నివేదిత సతీష్‌, సిబి చంద్రన్‌, అతుల్‌, నాజర్‌, లక్ష్మీప్రియ, చంద్రమౌళి, గీత కై లాసం ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతున్న ఓ బటర్‌ ఫ్లై చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది భార్య భర్తల మధ్య ప్రేమ, చిన్న చిన్న మనస్పర్థలు వంటి అంశాలతో కూడిన సస్పెన్‌న్స్‌, థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందించిన చిత్రమని చెప్పారు. ఆసక్తికరమైన అంశాలు, భావోద్వేగ సన్నివేశాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించే చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్‌ను 40 రోజుల్లో పూర్తి చేశామని, ఎక్కువ భాగం కొడైకెనాల్‌లో చిత్రీకరించినట్లు చెప్పారు. చిత్రంలో సీతాకోకచిలుక ఒక భాగం అవుతుందని చెప్పారు. చివరిగా ఏది మన చేతుల్లో ఉండదనే చిన్న సందేశంతో కూడిన చిత్రంగా ఇది ఉంటుందన్నారు. ఈ చిత్రానికి బలమైన సాంకేతిక వర్గం పనిచేసినట్లు చెప్పారు. వైసాక్‌ సోమనాథ్‌ సంగీతాన్ని అందించారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement