అబ్బురం.. ద్వాదశ జ్యోతిర్లింగం
నగరి: మున్సిపల్ పరిధిలోని కీళపట్టు త్రిపుర సుందరీ సమేత చంద్రమౌళీశ్వర ఆలయ ఆవరణలో శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఏడాది వినూత్న అమరికలు చేపట్టడం పరిపాటిగా వస్తోంది. ఈ ఏడాది ఆలయం వద్ద ఎలాంటి నిర్మాణాలు చేపడతారనే ఉత్కంఠ కూడా ప్రజల్లో ఉంది. ఈ ఏడాది భక్తులను ఆకట్టుకునేలా ఓంకారేశ్వర, కాశీ విశ్వనాథ, భీమేశ్వర, రామనాథ, త్రయంబకేశ్వర, నాగేశ్వర, సోమనాథ, మల్లికార్జున, వైద్యనాథ, ఘృష్మేశ్వర, కేదారేశ్వర, మహాకాళేశ్వర అంటూ ద్వాదశ జ్యోతిర్లింగాలను, శ్మశానాధీశుని ప్రతిమను ఆకట్టుకునేలా ప్రతిష్టించారు. ఆయా ప్రాంతాల్లోని విగ్రహాలను అచ్చుపోసినట్లు చేపట్టిన ఈ అమరికలు చూపరులను అమితంగా ఆకర్షిస్తోంది. స్థానిక భక్తుడు గణేశ్ ఆధ్వర్యంలో స్థానిక యువకులు రెండు నెలలుగా కష్టపడి ఈ అమరికలను సిద్ధం చేశారు. అత్యంత ప్రత్యేకత సంతరించుకున్న ఈ శిలారూపాలను వీక్షించడానికి స్థానిక భక్తులు ఆసక్తి చూపుతున్నారు.
అబ్బురం.. ద్వాదశ జ్యోతిర్లింగం


