ప్రారంభ దశలో గుర్తిస్తే క్యాన్సర్ నుంచి విముక్తి
కొరుక్కుపేట: క్యాన్సర్ చూసి భయపడ వద్దని ప్రారంభ దశలో గుర్తించి తగిన వైద్యం తీసుకుంటే విముక్తి పొందవచ్చునని అపోలో ఆసుపత్రి వైద్యులు అభిప్రాయపడ్డారు. చైన్నెలోని అపోలో క్యాన్సర్ సెంటర్, అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా జీరో టు హీరో పేరుతో కేన్సర్ అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ ఆసుపత్రుల వైద్యులు ముందస్తూ కేన్సర్‌ను గుర్తించటం పై చర్చా కార్యక్రమం నిర్వహించారు. సర్జికల్ ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అయ్యప్పన్ నేతృత్వంలో యూరో–ఆంకాలజీ , రోబోటిక్ సర్జరీ కన్సల్టెంట్ డాక్టర్ ఆర్. శ్రీవత్సన్ సర్జికల్ ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ పి. వెంకట్, బ్రెస్ట్ సర్జరీ కన్సల్టెంట్ డాక్టర్ ఆశా రెడ్డి సర్జికల్ ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అజిత్ పాయ్, సర్జికల్ ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సెంథిల్ కుమార్ ఎ.సి., సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సెంథిల్ కుమార్ గణపతి వంటి బహుళ విభాగ ఆంకాలజిస్టుల ప్యానెల్ లో పాల్గొని మాట్లాడారు. క్యాన్సర్ రకాలను ముందస్తుగా గుర్తించడం సరళమైన, మరింత ప్రభావవంతమైన చికిత్స, మెరుగైన మనుగడ ఫలితాల ప్రధాన సందేశాన్ని ప్యానెల్ హైలైట్ చేసింది, ప్రారంభంలో క్యాన్సర్‌ను గుర్తిస్తే పూర్తిగా విముక్తి పొందవచ్చని తెలిపారు.


