గుండెపోటుతో ప్రయాణికుడు మృతి
చంద్రగిరి: గుండెపోటుతో ప్రయాణికుడు మృతి చెందిన ఘటన సోమవారం ఐతేపల్లి సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరు సమీపంలోని హసన్ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్(48) విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో వంట కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం విశాఖపట్నం నుంచి బెంగళూరుకు ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బయల్దేరాడు. ఈ క్రమంలో ఐతేపల్లి వద్ద వెళుతున్న క్రమంలో చంద్రశేఖర్ ఫోన్ రింగ్ అయ్యింది. ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో తోటి ప్రయాణికులు చంద్రశేఖర్‌ను వద్దకు వెళ్లి పరిశీలించారు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ ప్రవళిక మృతదేహాన్ని పరిశీలించి, చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సాయంత్రం మృతదేహాన్ని బంధువులకు అప్పగించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


