మహాబలిపురం వేదికగా ఐపీఎంఏ గ్లోబల్ ప్రాజెక్టు
సాక్షి, చైన్నె : చైన్నె శివారులోని మహాబలిపురంలో ఐపీఎంఏ గ్లోబల్ ప్రాజెక్ట్ ఏర్పాటు కానుంది. ఇందులో భాగంగా శుక్ర, శనివారం ప్రొఫెషన్ ఫోరం ప్రపంచ పరివర్తనకు ప్రాజెక్టు నిర్వహణ గురించి చర్చించనున్నారు. సమర్థవంతమైన ప్రాజెక్ట్ నిర్వహణ రంగంలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అయిన ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఐపీఎంఏ ఇండియా ఎడిషన్ గురించి గురువారం పీఎంఏ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ఏ శివథాను పిళ్‌లై, ఐపీఎంఏ అధ్యక్షుడు మ్లాడిన్ ఉకుమనొవిస్, మాజీ అధ్యక్షుడు రిహార్డ్ వార్నర్, ఉపాధ్యక్షుడు వ్లాడ్మిర్ ఒబ్రొడొవిస్‌లు చైన్నెలో ప్రకటించారు.
ప్రాజెక్ట్ వృత్తి భవిష్యత్తు దిశ, సాంకేతికత ఆధారిత ప్రాజెక్టుల రూపకల్పన, స్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రాజెక్ట్ నిర్వహణ పాత్ర వంటి అంశాలపై జాతీయ, అంతర్జాతీయ నిపుణులు చర్చించనున్నారని తెలిపారు. పరిశ్రమ నాయకులు, గ్లోబల్ ప్రాజెక్ట్ మేనేజర్లు, విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు ఈ వేదికపై ఒకచోట చేర్చనున్నామని వివరించారు. వేగంగా మారుతున్న సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్ అమలు, పాలన విధానాలను ఎలా ప్రభావితం చేస్తోందనే అంశంపై ప్రత్యేకంగా చర్చలు జరుగనున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు కార్యక్రమానికి మంత్రి పళణి వేల్ త్యాగరాజన్ హాజరు కానున్నట్టు ప్రకటించారు.


