వైభవం..మహాకుంభాభిషేకం
వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి తారాపడవేడు ప్రాంతంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయ ప్రాంగణంలో హోమ పూజలను నిర్వహించారు. అనంతరం వివిధ పుణ్య నదుల నుంచి తీసుకొచ్చిన నీటిని హోమ గుండం వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివాచార్యుల వేద మంత్రాల నడుమ హోమ గుండంలో ఉంచిన కలశ నీటిని రాష్ట్ర జౌళీశాఖ మంత్రి గాంధీ, వేలూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో భక్తులు కలశ నీటిని మేళ తాళాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయ రాజగోపురంపై కలశ నీటిని పోసి కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం పుణ్య జలాన్ని భక్తులపై చల్లారు. ఆలయంలోని వరదరాజ పెరుమాళ్ విగ్రహానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి పుష్పాలంకరణలు, దీపారాధన పూజలు జరిపారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ చైర్మన్ బాబు, ఆలయ కార్యనిర్వాహక అఽధికారి మల్లిక, ఽఆలయ ట్రస్ట్ సభ్యులు కన్నన్, లలిత, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


