నాకు ప్రత్యేకం ఉయిరుళ్లవరై ఉష | - | Sakshi
Sakshi News home page

నాకు ప్రత్యేకం ఉయిరుళ్లవరై ఉష

Feb 14 2026 7:57 AM | Updated on Feb 14 2026 7:57 AM

నాకు ప్రత్యేకం ఉయిరుళ్లవరై ఉష

నాకు ప్రత్యేకం ఉయిరుళ్లవరై ఉష

తమిళసినిమా: టి.రాజేందర్‌ కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించి ప్రధాన పాత్రను పోషించిన చిత్రం ఉయిరుళ్లవరై ఉష. ఈ చిత్రంలో నటుడు గంగ, నళిని హీరో హీరోయిన్‌గా నటించారు. నళిని కథానాయకిగా పరిచయమైన మొదటి చిత్రం ఇదే కావడం గమనార్హం. రాధారవి, గౌండమణి, సరిత ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం 1983లో విడుదలై అనూహ్య విజయాన్ని సాధించింది. గతంలో మంచి విజయం సాధించిన చిత్రాలు ఇప్పుడు మళ్లీ విడుదల కావడం ట్రెండీగా మారిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఉయిరుళ్లవరై ఉష చిత్రం కూడా 43 ఏళ్ల తర్వాత శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా రీరిలీజ్‌ అయ్యింది. దీన్ని ఫోర్‌ కే డిజిటల్‌ ఫార్మెట్లో రూపొందించినట్లు టీ.రాజేందర్‌ తెలిపారు. ప్రేమ కథ చిత్రాలకు ఎప్పటికీ మంచి ఆదరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రం రీ రిలీజ్‌ అయినా సందర్భంగా శింబు తన ఇన్‌స్ట్రాగామ్‌లో ఒక పోస్ట్‌ చేశారు. అందులో ‘సిల్వర్‌ జూబ్లీ ’వేడుకలను జరుపుకున్న చిత్రం ఉయిరుళ్ళవరై ఉష. టి రాజేందర్‌ పూర్తి స్థాయిలో కనిపించిన తొలి చిత్రం ఇది. తన ప్రేయసి పేరునే చిత్ర టైటిల్‌గా మార్చిన నటుడు రాజేందర్‌. ఉత్తమ నటనను ప్రదర్శించిన నటీనటులు, సంగీతం ప్రేక్షకుల హృదయాల్లోనే కాకుండా, నా మనసులోనూ ప్రత్యేకంగా నిలిచిపోయింది. అలాంటి ఈ క్లాస్‌ మూవీ మరోసారి విజయం సాధించాలి అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement