అవార్డుకు నామినేట్ అయిన మయిలా
తమిళసినిమా: కమర్షియల్ తరహాలో.. చక్కని సందేశం ఇచ్చే సినిమాలు అరుదుగా రూపొందుతుంటాయి. అలాంటి చిత్రం మయిలా. మహిళ దర్శకురాలు చెమ్మల అన్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దర్శకుడు పా.రంజిత్ సమర్పణలో న్యూటన్ సినిమా నిర్మించింది. ళటి పీ.మెలోడీ డార్కస్ ప్రధాన పాత్రను పోషించిన ఇందులో వి.సుడర్ కోడి కీలక పాత్రను పోషించారు. కాగా ఈ చిత్రం 2026వ సంవత్సరానికి గాను రోటర్డామ్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో నెట్ పాక్ ( నెట్ వర్క్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఆసియన్ సినిమా) అవార్డుకు నామినేట్ అయ్యింది. అద్భుతమైన క్రియేటివిటీ, కల్చర్, డెప్త్, ఎక్సలన్స్ సినిమాటిక్ అంశాలతో కూడిన చిత్రాలకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. కాగా ఈ చిత్రం అంతర్జాతీయ నెట్ పాక్ అవార్డుకు నామినేట్ కావడంపై చిత్ర దర్శకురాలు అన్నం తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఈ అవార్డుకు నామినేట్ కావడం తమ యూనిట్ కు అర్థవంతమైన అంగీకారం అయ్యిందన్నారు. ఈ చిత్రాన్ని ఎంతో నిజాయితీ, నిబద్ధతతో రూపొందించినట్లు చెప్పారు. ఐఎఫ్‌ఎఫ్‌ఆర్ ( ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్)లో అవార్డుకు నామినేట్ కావడం తమకు మరింత ఉత్సాహాన్ని కలిగించిందని పేర్కొన్నారు. మయిలా చిత్రం సమాజంలోని భాగవతరాకాలను యదార్ధంగా ఆవిష్కరించిన కథా చిత్రం అని దర్శకుడు పా.రంజిత్ పేర్కొన్నారు. ఇలాంటి చిత్రాలు అంతర్జాతీయ వేదికలపై చోటు చేసుకోవడం చాలా ముఖ్యమని, ఈచిత్రం అందుకు అర్హత కలిగినదేనని ఆయన పేర్కొన్నారు. మయిలా చిత్రం మరిన్ని అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంటుందని నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.


