వరుస కడుతున్న రీ రిలీజ్‌ చిత్రాలు | - | Sakshi
Sakshi News home page

వరుస కడుతున్న రీ రిలీజ్‌ చిత్రాలు

Feb 11 2026 7:49 AM | Updated on Feb 11 2026 7:49 AM

వరుస కడుతున్న రీ రిలీజ్‌ చిత్రాలు

వరుస కడుతున్న రీ రిలీజ్‌ చిత్రాలు

తమిళసినిమా: ఇంతకుముందు విడుదలైన స్టార్స్‌ చిత్రాలు మళ్లీ విడుదల కావడం అనేది ఇటీవల అధికమైందని చెప్పాలి. గతంలో ఎన్జీఆర్‌, శివాజీ గణేషన్‌ వంటి హీరోలు నటించిన చిత్రాలు మళ్లీ మళ్లీ విడుదలై మంచి వసూళ్లు సాధించేవి. కాగా అలాంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది అనే చెప్పాలి. నటుడు విజయ్‌ కథానాయకుడిగా నటించిన గిల్లి చిత్రం విడుదలై సత్తా చాటింది. ఆ తర్వాత పలు స్టార్‌ హీరోల చిత్రాలు రీ రిలీజ్‌ కు వరస కడుతున్నాయి. ఈ మధ్య విజయకాంత్‌ నటించిన కెప్టెన్‌ ప్రభాకరన్‌ మళ్లీ విడుదల అయ్యి మంచి కలెక్షనన్స్‌ సాధించింది. ఇటీవల రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన పడయప్పా చిత్రం రీ రిలీజ్‌ అయ్యి రిలీజ్‌ అయ్యింది. మొదట్లో ఈ చిత్రం రూ.60 కోట్లు వసూలు చేస్తే, రీరిలీజ్‌ లో రూ.70 కోట్లు వసూలు చేసి సినిమా పండితులను ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత అజిత్‌ కథానాయకుడిగా నటించినా మంగాత్త చిత్రం రీరిలీజ్‌ అయ్యి థియేటర్లలో సందడి చేసింది. ఇలానే తాజాగా మరికొన్ని చిత్రాలు రీ రిలీజ్‌ కు సిద్ధమవుతున్నాయి. అందులో శింబు నటించిన సిలంబాట్టం, విన్నైతాండి వరువాయా, మాధవన్‌ నటించిన మిన్నలే వంటి చిత్రాలు ఉన్నాయి. అదేవిధంగా తాజాగా సూర్య కథానాయకుడిగా నటించిన మౌనం పేసియదే చిత్రం ఈనెల 13వ తేదీన ప్రేమికుల రోజు సందర్భంగా రీరిలీజ్‌ కావడానికి సిద్ధమవుతోంది. నటి త్రిష, లైలా, హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి అమీర్‌ దర్శకత్వం వహించారు. ఇది దర్శకత్వం వహించిన తొలి చిత్రం అన్నది గమనార్హం. యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం 2002లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా 24 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మౌనం పేసియదే చిత్రం రీ రిలీజ్‌ అవుతున్న సందర్భంగా నటుడు సూర్య ఒక వీడియోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. అందులో మంచి ప్రేమ కథ చిత్రం మళ్లీ విడుదల కావడం సంతోషంగా ఉందని, ఈ చిత్రాన్ని మళ్లీ థియేటర్లో ప్రేక్షకుల మధ్య చూడాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రముఖ నటులు గతంలో నటించిన చిత్రాలు ఇప్పుడు మళ్లీ రీరిలీజ్‌ కు వరస కట్టడంతో నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న చిన్న చిత్రాల నిర్మాతలు బెంబేలు ఎత్తుకున్నారు. తమ చిత్రాలకు థియేటర్లు వహించడం లేదని, లభించిన థియేటర్లో విడుదల చేసినా ప్రేక్షకులు లేక వెలవెల పోతున్నాయని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిర్మాతల సంఘం మంచి పరిష్కారం చూపాలనే డిమాండ్‌ వ్యక్తం అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement